Advertisement

  • శుక్రవారం బంగారంతో బాటు భారీగా తగ్గిన వెండి ధర

శుక్రవారం బంగారంతో బాటు భారీగా తగ్గిన వెండి ధర

By: chandrasekar Fri, 04 Sept 2020 8:08 PM

శుక్రవారం బంగారంతో బాటు భారీగా తగ్గిన వెండి ధర


పెళ్లిళ్ల కోసం బంగారం కొనదలచిన వారికి ఇప్పుడు ఒక మంచి అవకాశం. దేశీయ షేర్ మార్కెట్ లో పసిడి ధరలు వెలవెలబోయింది. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈరోజు కూడా పసిడి ధర పడిపోయింది. బంగారం ధర భారీగా దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ పసిడి పడిపోవడం గమనార్హం. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.

భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 పడిపోయింది. దీంతో ధర రూ.48,770కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.430 క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,200కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 పడిపోయింది. దీంతో ధర రూ.65,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1941 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.39 శాతం పెరుగుదలతో 26.90 డాలర్లకు ఎగసింది.

పసిడి ధరలు తగ్గడానికి లేదా మార్పుకు చాలానే అంశాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడిప్పుడే పసిడి ధరలు తగ్గు ముఖం పట్టడంతో ప్రజలు సంతోషిస్తున్నారు.

Tags :
|
|

Advertisement