Advertisement

  • దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది ...ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది ...ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

By: Sankar Wed, 28 Oct 2020 08:31 AM

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది ...ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్


కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ప్రతికూల (మైనస్‌) స్థాయిలో లేదా దాదాపు సున్నా (శూన్య) స్థాయిలో నమోదు కావచ్చని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా 23.9 శాతం క్షీణించడమే ఇందుకు కారణమన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మెరుగుపడుతుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్‌లాక్‌ ప్రక్రియతో స్థూల ఆర్థిక సూచీలు మెరుగుపడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు.

ప్రస్తుత పండుగల సీజన్‌తో ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్తేజం లభిస్తుందని, దీంతో మిగిలిన రెండు త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిరేటు నమోదు కావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు ప్రజల వ్యయ సామర్థ్యాన్ని పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Tags :
|

Advertisement