Advertisement

  • తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు

By: chandrasekar Thu, 20 Aug 2020 1:43 PM

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు


తెలంగాణ‌లో ఈ నెల 21న భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మ‌హ‌బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది.

వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags :
|

Advertisement