Advertisement

  • కాషాయం కండువా కప్పుకున్న కామన్వెల్త్ స్వర్ణ పతాక విజేత శ్రేయాసి సింగ్

కాషాయం కండువా కప్పుకున్న కామన్వెల్త్ స్వర్ణ పతాక విజేత శ్రేయాసి సింగ్

By: chandrasekar Mon, 05 Oct 2020 09:28 AM

కాషాయం కండువా కప్పుకున్న కామన్వెల్త్ స్వర్ణ పతాక విజేత శ్రేయాసి సింగ్


కామన్వెల్త్ స్వర్ణ పతాక విజేత శ్రేయాసి సింగ్ కాషాయం కండువా కప్పుకున్నారు. అంతర్జాతీయ షూటర్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత శ్రేయాసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం పార్టీ మాజీ మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి ద్విగ్విజయ్‌ సింగ్‌, పుతుల్‌ కుమారిల కూతురే శ్రేయాసి సింగ్‌. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 2018 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 2014 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం అందుకున్నారు. బిహార్‌ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరడంతో శ్రేయాసి సింగ్‌ ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీలో చేరడం వల్ల ఆ ప్రాంతంలోని క్రీడాకారులను రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలుపవచ్చు. అమర్‌పూర్ (బంకా) లేదా జాముయి నుంచి బరిలో నిలిచే అవకాశం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ ఎంపీ, శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ కుమారి కూడా తిరిగి బీజేపీ గూటికి రానున్నారు. పుతుల్ కుమారి ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగుబాటుదారుగా ఎన్నికల్లో పోటీ చేసినందున ఆమెకు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు. ఈ కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమె కూడా తిరిగి బీజేపీ గూటికి చేరేందుకు వీలు చిక్కింది. మరి ఈ సరి బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Tags :
|

Advertisement