Advertisement

శ్రేయస్ అయ్యర్‌‌లో నాయకత్వ ప్రతిభ ఉంది...

By: chandrasekar Wed, 18 Nov 2020 5:23 PM

శ్రేయస్ అయ్యర్‌‌లో నాయకత్వ ప్రతిభ ఉంది...


తాజాగా ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ అలెక్స్‌ కేరీ టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్‌‌పై అలెక్స్‌ ప్రశంసల జల్లు కురింపించారు. అతను వ్యక్తి గత ప్రదర్శన కంటే జట్టు శ్రేయస్సు గురించే ఎక్కువగా ఆలోచిస్తారన్నారు. శ్రేయస్ అయ్యర్‌‌లో నాయకత్వ ప్రతిభ ఉంది. అతను భవిష్యత్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తాడు. జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం ఉంది. తన స్వంత లాభం కంటే జట్టు ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అది ఢిల్లీ టీంను నడిపించే తీరులోనే తెలుస్తోంది. గత సీజన్లలో ఆ టీంను విజయపథంలో గొప్పగా నడిపించాడు. బ్యాటింగ్‌లో కూడా అత్యుత్తమంగా రాణించగలడు. వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తి. మైదానంలో పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటాడు. ముఖ్యంగా కోచ్‌ రికీ పాంటింగ్‌‌తో మంచి అనుబంధం ఉంటుంది. అతను భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు" అన్నారు కేరీ

ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ సామర్ధ్యం తగ్గట్టుగా రాణించింది. శ్రేయస్‌ సారథ్యంలోని జట్టు తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓటమిపాలైంది. తొలిసారి ఫైనల్‌కు వచ్చిన ఢిల్లీని ఓడించి... ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంది ముంబై. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఐపీఎల్‌లో తమకు ఎదురే లేదని మరోసారి నిరూపించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్ సేన. ఢిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. ఇషాన్ కిషన్ 30 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. డికాక్ 20, సూర్యకుమార్ యాదవ్ 19, పొలార్డ్ 9 రన్స్ చేశారు.

Tags :
|
|

Advertisement