Advertisement

  • సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ

By: chandrasekar Thu, 10 Sept 2020 3:02 PM

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ


సీరం ఇనిస్టిట్యూట్‌కు ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ బ్రిటన్ లో నిలిపివేసిన సమాచారం ఇవ్వకపోవడంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నోటీసు పంపింది. వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొంటున్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశారు. దీనిపై వివరణ కోరుతూ డీజీసీఐ టీకా తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ యొక్క బ్రిటన్ ట్రయల్స్‌లో పాల్గొంటున్నవారిలో ఒకరికి అనారోగ్యానికి దారితీసిన ట్రయల్ ఫలితాలను డీజీసీఐకి వెల్లడించనందున షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కొన్ని వర్గాలు ధృవీకరించింది. బ్రిటిష్-స్వీడిష్ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా సహకారంతో జెన్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ యొక్క భారతీయ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్.

ఆక్స్ఫర్డ్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆశాజనకమైన టీకాగా పరిగణిస్తున్నారు. “ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా నిర్వహించిన క్లినికల్ ట్రయల్ నిలుపుదల గురించి కేంద్ర లైసెన్సింగ్ అధికార సంస్థకు తెలియజేయలేదు” అని సీరం ఇనిస్టిట్యూట్ కు ఇచ్చిన నోటీసులో డీజీసీఐ ప్రశ్నించింది. రోగులకు భద్రత ఏర్పడే వరకు భారతదేశంలో వ్యాక్సిన్ అభ్యర్థి యొక్క దశ 2, 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని షోకాజ్ నోటీసులో ప్రశ్నించింది. గత నెలలో దేశంలోని 17 దవాఖానలలో 1,000 మంది పాల్గొనే కరోనా వైరస్ వ్యాక్సిన్ దశ 2, 3 మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.

Tags :
|
|

Advertisement