Advertisement

మెట్రోలో మాస్క్ ధరించలేదో ..భారీ జరిమానానే

By: Sankar Thu, 03 Sept 2020 7:45 PM

మెట్రోలో మాస్క్ ధరించలేదో ..భారీ జరిమానానే


కరోనా మహమ్మారి వలన విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని మూతపడి ఇటీవల ఒక్కొక్కటిగా మళ్ళీ ఓపెన్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే ఆన్ లాక్ 4 లో భాగంగా దేశ వ్యాప్తంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే..సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు నడవబోతున్నాయి.

కరోనా నిబంధనలు పాటిస్తూనే మెట్రోను నడిపేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ప్యాసింజర్లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటారు. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో కూడా భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరాన్ని సీసీ టీవీ ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. మెట్రో రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

ఒకవేళ ఎవరైనా మాస్క్ ధరించకుంటే వారికి భారీ జరిమానా విధిస్తారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. మెట్రో ఉద్యోగులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి. స్మార్ట్ కార్డు క్యాష్ లెస్ విధానంలోనే టిక్కెట్లు మంజూరు చేసేందుకు మెట్రో సిద్ధం అవుతున్నది.

Tags :
|
|
|

Advertisement