Advertisement

  • ఎన్టీఆర్ పేరును ఏవైనా రెండు జిల్లాలకు పెట్టాలి ..స్టార్ డైరెక్టర్ వై వి యస్ చౌదరి

ఎన్టీఆర్ పేరును ఏవైనా రెండు జిల్లాలకు పెట్టాలి ..స్టార్ డైరెక్టర్ వై వి యస్ చౌదరి

By: Sankar Thu, 28 May 2020 11:26 AM

ఎన్టీఆర్ పేరును ఏవైనా రెండు జిల్లాలకు పెట్టాలి ..స్టార్ డైరెక్టర్ వై వి యస్ చౌదరి

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం దక్కించుకున్న నటుడు నట రత్న ,విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు..ఎన్నో గొప్ప గొప్ప పాత్రలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు .. ఈ నేపథ్యంలో ఎన్టీయార్ గురించి వైవీఎస్ చౌదరి ఓ లేఖ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏవైనా రెండు జిల్లాలకు ఎన్టీయార్ పేరు పెట్టాలని, ఎన్టీయార్‌కు `భారతరత్న` వచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాలను కోరారు.

ఎన్టీయార్ నాకు దేవుడు. ఎంతోమందికి దైవ సమానుడు. ఆయన దివ్య మోహనరూపమే నన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది. ఆయన ఆశయాల స్పూర్తితోనే నేను ఇక్కడ నిలబడ్డాను. నేనిక్కడ పొందిన కీర్తి, సంపాదిస్తున్న ప్రతీ పైసా ఆయన అకౌంట్ నుంచి డ్రా చేసుకుంటున్నట్టే భావిస్తాను. నేనే కాదు.. అమలాపురంలోని రిక్షాపుల్లర్ నుంచి, ఎక్కడో అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ వరకూ ఆయన అభిమానులే. తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన ఆ మహాపురుషుని జ్ఞాపకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ఎన్టీయార్ పేరు పెట్టాలని, ఆయణ్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువారి చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారత ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతున్నాను` అంటూ వైవీఎస్ పేర్కొన్నారు.





Tags :
|

Advertisement