Advertisement

  • సైబర్ నేరాలపై ప్రజల్లో అప్రమత్తత కోసం షార్ట్ ఫిల్మ్: కమీషనర్ అఫ్ పోలీస్

సైబర్ నేరాలపై ప్రజల్లో అప్రమత్తత కోసం షార్ట్ ఫిల్మ్: కమీషనర్ అఫ్ పోలీస్

By: chandrasekar Sat, 12 Dec 2020 11:06 AM

సైబర్ నేరాలపై ప్రజల్లో అప్రమత్తత కోసం షార్ట్ ఫిల్మ్: కమీషనర్ అఫ్ పోలీస్


గత కొంతకాలంగా దేశంలో సైబర్ నేరాలు హెచ్చుమీరుతున్నాయి. చాలా మంది మోసగాళ్లు సొసైటీ లో తను వీఐపీలు గాను మరియు సెలబ్రిటీల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి బారినుండి జాగ్రత్తపడుటకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ టీవీ నటులచే నిర్మించబడ్డ షార్ట్ ఫిల్మ్ లను తయారు చేసి విడుదల చేశారు. ముఖ్యంగా వీరు వీఐపీలు, సెలబ్రిటీలు, ప్రముఖుల సోషల్‌ మీడియా ఖాతాలనే టార్గెట్‌ చేసి మోసం చేస్తున్నారు. అధికంగా వీరు సెలబ్రిటీలు పేరుతో డూప్లికేట్ అకౌంట్ సోషల్ మీడియాలో సృష్టించి చాట్ చేయడం ద్వారా మోసానికి పాల్పడుతున్నారు.

సంఘంలో ప్రముఖులు తరచూ తమ సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఇందువల్ల నకిలీ ఐడీలు ఉంటే గుర్తించవచ్చని తెలిపారు. ఇలా గుర్తించడం ద్వారా సైబర్‌ క్రైం పోలీసులకు వివరాలు అందిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. సాధారణంగా వీవీఐపీ, వీఐపీ, సినీ ప్రముఖుల పేర్లతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తే వీటిని నమ్మవద్దని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో అవగాహన కలుగుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement