Advertisement

  • షూటింగ్ పూర్తి చేసుకున్న జెర్సీ బాలీవుడ్ రీమేక్

షూటింగ్ పూర్తి చేసుకున్న జెర్సీ బాలీవుడ్ రీమేక్

By: Sankar Tue, 15 Dec 2020 12:33 PM

షూటింగ్ పూర్తి చేసుకున్న జెర్సీ బాలీవుడ్ రీమేక్


తెలుగులో నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ఒక మైలురాయిగా గా నిలిచినా సినిమా జెర్సీ ...గౌతం తిన్ననూరి దర్శకత్వంలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో నాని అద్భుత నటనకు అందరు ఫిదా అయ్యారు...క్రికెటర్ గా , జాబ్ లేని తండ్రిగా నాని కనబరిచిన నటన అద్భుతం అనే చెప్పాలి ..అందుకే ఈ సినిమా కు కేవలం తెలుగులోనే గాక దేశవ్యాప్తంగా కూడా మంచి గురింపు వచ్చింది...అందుకే ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ..

అయితే ఈ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టిన్నపటికి క‌రోనా వ‌ల‌న ఆగిపోయింది. అయితే ఇటీవ‌ల తిరిగి మొద‌లు పెట్ట‌గా, 47 రోజుల‌లో షూటింగ్ పూర్తి చేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో కాస్త ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు షాహిద్జెర్సీ చిత్రాన్ని 47 రోజుల్లో, అందులోనూ ఇలాంటి కోవిడ్ సమయంలో పూర్తి చెయ్యడం నమ్మశక్యంగా లేదని అంతే కాకుండా ఇలాంటి ఒక చిత్రంలో తాను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాని చెప్పాడు షాహిద్.

సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. జెర్సీ చిత్రం స్పూర్తిని క‌లిగించే చిత్రం.అశృవుల నుంచి పైకి లేచే ఆత్మ కథ.ఈ చిత్రం మ‌ధుర జ్ఞాప‌కంగా నిలుస్తుంది. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్ననూరి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారికి ధన్య వాదాలు తెలిపారు షాహిద్

Tags :
|

Advertisement