Advertisement

  • షాకింగ్ న్యూస్... ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నూడుల్స్ తిని మృతి

షాకింగ్ న్యూస్... ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నూడుల్స్ తిని మృతి

By: chandrasekar Thu, 22 Oct 2020 6:07 PM

షాకింగ్ న్యూస్... ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నూడుల్స్ తిని మృతి


చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హీలాంగ్జియాంగ్‌ ప్రావిన్స్‌కులోని జిసి నగరానికి చెందని ఓ కుటుంబం కొన్ని రోజుల క్రితం సువాన్ టాంగ్జీ (నూడిల్స్ వంటకం) తిని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అక్టోబరు 10న ఎనిమిది మంది చనిపోగా 19న మరొకరు కన్నుమూశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ఆ నూడుల్స్‌తో ఏముంది? ఎవరైనా విషం కలిపారా? అని రకరకాలుగా చర్చించుకున్నారు. ఐతే అక్కడి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సంవత్సరం కింద ఆ వంటకాన్ని తయారు చేశారు. దాన్ని అప్పటి నుంచీ ఫ్రిజ్‌లో ఉంచారు. అక్టోబరు 5న బయటకు తీసి 9 మంది తిన్నారు. అనంతరం ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు ఐతే ఆ వంటకం రుచి నచ్చక ముగ్గురు పిల్లలు తినలేదు. వారు తినకపోవడమే మంచిదయింది. లేదంటే వారు కూడా చనిపోయే వారని స్థానికులు వెల్లడించారు.

ఈ ఘటనపై హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌‌‌కు చెందిన ఫుడ్‌ సేఫ్టీ డైరెక్టర్ గావో పీయ్‌ స్పందించారు బాంగ్‌క్రెకిక్ యాసిడ్ అనే విషం కారణంగానే వారంతా చనిపోయారని.. చెడిపోయిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. బియ్యం, ఇతర పిండి పదార్థాలను పులియబెట్టడం వల్ల బాంగ్‌క్రెకిక్ ఉత్పత్తి అవుతుంది. ఈ విషానికి విరుగుడు ఉండదు. బాంగ్‌క్రెకిక్ శరీరంలోకి వెళ్లిన తర్వాత కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. అంతేకాదు తిన్న 24 గంటల్లోనే మరణం కూడా సంభవించవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. బాంగ్‌క్రెకిక్ యాసిడ్ వల్ల శరీరంలో కిడ్నీలు, కాలేయం, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వేడిచేసినప్పటికీ ఇది నశించదు. వంటకాల్లో అలాగే ఉండిపోతుంది. ఇది శరీరంలోకి వెళ్తే మనిషి చనిపోయే అవకాశాలు 40-100 వరకు ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అందుకే ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని వెల్లడించారు. ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ అంత శ్రేయస్కరం కాదని సూచిస్తున్నారు.

Tags :
|

Advertisement