Advertisement

  • Google Pay యూజర్లకు షాక్... ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఫీజ్ వసూలు...

Google Pay యూజర్లకు షాక్... ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఫీజ్ వసూలు...

By: chandrasekar Wed, 25 Nov 2020 7:58 PM

Google Pay యూజర్లకు షాక్... ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఫీజ్ వసూలు...


ఇటీవల అమెరికాలో గూగుల్ పే కొత్త యాప్ రిలీజ్ అయింది. ఆ కొత్త యాప్ ఇండియాలో కూడా రానుంది. గూగుల్ పే కొత్త అవతారంలో వస్తుండటంతో అనేక మార్పులు కూడా ఉండబోతున్నాయి. కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. పాత ఫీచర్స్ కనిపించకుండ పోతాయి. గూగుల్ పే యూజర్లు 2021 జనవరి నుంచి వెబ్‌సైట్ ఉపయోగించడానికి వీల్లేదు. pay.google.com పేరుతో వెబ్‌సైట్ ఉన్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఈ వెబ్‌సైట్ పనిచేయదు. అంటే ఈ వెబ్‌సైట్ నుంచి డబ్బులు పంపడం, స్వీకరించడం సాధ్యం కాదు. అమెరికాలో కొత్తగా గూగుల్ పే యాప్ లాంఛ్ చేసిన గూగుల్... వెబ్ యాప్‌ను తొలగించింది. పాత గూగుల్ పే యాప్ కూడా ఉండదు. కేవలం కొత్త గూగుల్ పే యాప్ మాత్రమే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారానే లావాదేవీలు జరపొచ్చు.

పాత గూగుల్ యాప్ 2021 జనవరి నుంచి స్మార్ట్‌ఫోన్లలో పనిచేయదని గూగుల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఫీజ్ కూడా వసూలు చేస్తోంది గూగుల్. "మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే 13 బిజినెస్ డేస్ పడుతుంది. డెబిట్ కార్డ్ ట్రాన్స్‌ఫర్స్ ద్వారా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ డెబిట్ కార్డ్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.5 శాతం ట్రాన్స్‌ఫర్ ఫీజ్ చెల్లించాలి" అని గూగుల్ ప్రకటించింది. గతంలో డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండేవి కావు. గూగుల్ పే కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు నవంబర్ మొదటి వారంలో రిలీజైంది. లోగో కూడా మారింది. త్వరలోనే ఇండియాలో కొత్త గూగుల్ పే యాప్ వచ్చే అవకాశముంది. ఇండియాలో కూడా కొత్త గూగుల్ పే యాప్ వస్తే అమెరికాలో అందుబాటులో ఉన్న ఫీచర్సే ఇక్కడ కూడా ఉండే అవకాశముంది.

Tags :
|

Advertisement