Advertisement

  • మొబైల్ బ్రాండ్ యాపిల్ సంస్థ ద్వారా చైనాకు షాక్

మొబైల్ బ్రాండ్ యాపిల్ సంస్థ ద్వారా చైనాకు షాక్

By: chandrasekar Tue, 07 July 2020 11:46 AM

మొబైల్ బ్రాండ్ యాపిల్ సంస్థ ద్వారా చైనాకు షాక్


4 వేల 5 వందల చైనీస్ గేమ్స్ ను తొలగించిన యాపిల్ సంస్థ చైనా కు మరో ఎదురుదెబ్బ తగిలింది. డిజిటల్ స్ట్రైక్స్ తో బారతదేశం ఇచ్చిన దెబ్బనుంచి కోలుకోకముందే ప్రఖ్యాత మొబైౌల్ బ్రాండ్ యాపిల్ చైనాకు షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను చైనీస్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో చైనా కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. రానున్న కాలంలో ఇతర సంస్థల నుంచి కూడా చైనా కంపెనీలకు వివిధ రూపాల్లో దెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. భారత చైనా సరిహద్దు వివాదం నేపధ్యంలో చైనాకు చెందిన 59 యాప్ లను ఇండియా నిషేధించింది.

ముఖ్యంగా కోట్లాది సంఖ్యలో యూజర్స్ ఉన్న టిక్ టాక్ ను నిషేధించడం చైనాకు భారీ షాక్ గా చెప్పుకోవచ్చు. భారతదేశం తీసుకున్న ఈ చర్యను అమెరికా వంటి దేశాలు సమర్దించాయి. దీంతో చైనా కంపెనీలకు ఆర్ధికంగా చాలా నష్టం చేకూరింది. ఈ నష్టం నుంచి తేరుకోకముందే ప్రముఖ మొబైల్ దిగ్గజమైన యాపిల్ సంస్థ చైనాకు ఊహించని జర్క్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్ నుంచి ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను యాపిల్ సంస్థ ఒక్కసారిగా తొలగించింది. దీంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

చట్టపరంగా ఎలాంటి అనుమతి లేకుండానే కొన్ని కంపెనీలు తమ గేమ్స్ ను యాప్ లలో ఉంచుతున్నాయనేది యాపిల్ సంస్థ చేస్తున్న ఆరోపణ. గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో చేపట్టిన మార్పుల కారణంగా తామీ ఈ గేమ్స్ ను తొలగించినట్టు యాపిల్ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఇంతకుముందే హెచ్చరించినట్టు సంస్థ తెలిపింది.

గతంలో విధించిన గడువు జూన్ 30తో పూర్తయినందున ఈ చర్యలు తీసుకున్నామని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. తమ సంస్థతో లైసెన్స్ నిబంధనల్ని తిరిగి రెన్యువల్ చేసుకున్న తరువాత మళ్లీ అప్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మొన్న చైనా యాప్ ల నిషేధం, ఇప్పుడు యాప్ స్టోర్ నుంచి గేమ్స్ తొలగింపుతో చైనా కంపెనీలకు ఎదురవుతున్న నష్టం విలువ 60-70 వేల కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement