Advertisement

  • పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన షోయబ్‌మాలిక్‌

పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన షోయబ్‌మాలిక్‌

By: chandrasekar Thu, 25 June 2020 1:09 PM

పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన షోయబ్‌మాలిక్‌


కరోనా ఎఫెక్ట్ క్రికెట్ పైన చాలా ఎక్కువ ప్రభావం చూపుతున్నది. నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ జరుగుతుందో లేదో సందేహంగా ఉంది. ఈ విషయం గురించి షోయబ్‌మాలిక్ మాట్లాడుతూ భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పోటీ ప్రపంచానికి ఎంతో అవసరమని ఆ జట్టు ఆటగాడు షోయబ్‌మాలిక్‌ అభిప్రాయ పడ్డాడు. ఇటీవల పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన అతడు ఇరు జట్లూ మళ్లీ సిరీస్‌లు ఆడాలని అన్నాడు.

ప్రపంచ క్రికెట్‌కు యాషెస్‌ సిరీస్‌ ఎంత ముఖ్యమో భారత్‌-పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లపై ఎంతో అభిమానంతో, గౌరవంతో మాట్లాడే మిత్రులు తనకు ఉన్నారని తెలిపాడు. తాను భారత్‌లో పర్యటించినప్పుడు కూడా మంచి ఆతిథ్యం లభించిందని తెలిపాడు.

ఒక వేళ నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరిగితే తమ జట్టు విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని తెలిపాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఏదైనా మీడియాలో పని చేయాలని ఉందని చెప్పాడు.

Tags :

Advertisement