Advertisement

  • బీహార్ ఎన్నికల్లో శివసేన ..ఓట్లు చీల్చడమే లక్ష్యం

బీహార్ ఎన్నికల్లో శివసేన ..ఓట్లు చీల్చడమే లక్ష్యం

By: Sankar Tue, 06 Oct 2020 3:48 PM

బీహార్ ఎన్నికల్లో శివసేన ..ఓట్లు చీల్చడమే లక్ష్యం


బీహార్ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ఆసక్తి పార్టీల్లో టెన్షన్ పెరుగుతున్నది. సీట్ల సర్దుబాటు విషయంలో అటు మహాకూటమి, ఇటు ఎన్డీయే కూటముల్లో బేదాభిప్రాయాలు తలెత్తడంతో కొన్ని పార్టీలో ఆయా కూటమి నుంచి బయటకు వచ్చి సొంతగా పోటీ చేస్తున్నాయి.

అయితే, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో అడుపెట్టేందుకు శివసేన పార్టీ కూడా సిద్ధం అయ్యింది. ఎలాగైనా బీహార్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో విజయం సాధించి చక్రం తిప్పాలని చూస్తోంది మరాఠా పార్టీ. 40 నుంచి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధం అయ్యింది. ఒకవేళ గెలవకపోయినా, హిందుత్వ అజెండా కలిగిన పార్టీ కాబట్టి కొంతమేర ఓట్లను చీల్చే అవకాశం ఉన్నది.

శివసేన బీహార్ లో పోటీ చేయడం వలన ఆ పార్టీకి లాభం చేకూరకపోయినప్పటికీ, ఎన్డీయే కూటమిలోని పార్టీలకు ఇబ్బందులు తలెత్తవచ్చు. అక్టోబర్ 28, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 7 వ తేదీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో శివసేన పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags :

Advertisement