Advertisement

  • బీజేపీ , శివసేన మధ్య ముదురుతున్న అర్ణబ్ గోస్వామి అరెస్ట్ వివాదం

బీజేపీ , శివసేన మధ్య ముదురుతున్న అర్ణబ్ గోస్వామి అరెస్ట్ వివాదం

By: Sankar Thu, 05 Nov 2020 8:09 PM

బీజేపీ , శివసేన మధ్య ముదురుతున్న అర్ణబ్ గోస్వామి అరెస్ట్ వివాదం


రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింత ముదురుతోంది. శివసేన, బీజేపీ మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. అర్నాబ్‌ అరెస్టును "బ్లాక్ డే" గా అభివర్ణించిన బీజేపీ నేతలపై శివసేన మండిపడింది.

బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్ననేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో కౌంటర్ ఎటాక్ చేసింది. ముఖ్యంగా "పత్రికా స్వేచ్ఛపై దాడి, "అత్యవసర పరిస్థితులు" అంటున్న పలువురు కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసింది. ఈ సందర్బంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, హత్యలను ప్రస్తావించింది.

మహారాష్ట్ర ప్రభుత్వంలో మీడియాపై దాడి అనే ప్రశ్నే లేదని, ఇలా అరోపిస్తున్నా వారే ప్రజాస్వామ‍్యం మొదటి స్థంభమైన శాసనసభను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడింది. గోస్వామిని రక్షించడానికే గత రాష్ట్ర ప్రభుత్వం నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్‌లో ఒక జర్నలిస్టును అరెస్టు చేశారు, యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది

Tags :
|
|

Advertisement