Advertisement

  • ఒకరినొకరు అర్థంచేసుకోవడమే ఆ జంట సక్సెస్ సీక్రెట్ ..ఇర్ఫాన్ పఠాన్

ఒకరినొకరు అర్థంచేసుకోవడమే ఆ జంట సక్సెస్ సీక్రెట్ ..ఇర్ఫాన్ పఠాన్

By: Sankar Tue, 30 June 2020 09:08 AM

ఒకరినొకరు అర్థంచేసుకోవడమే ఆ జంట సక్సెస్ సీక్రెట్ ..ఇర్ఫాన్ పఠాన్



రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ ప్రస్తుత లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జంట ..గత ఏడు ఏళ్లుగా తమ అద్భుత బాగస్వామ్యాలతో టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు ..టీమిండియా చేసే పరుగుల్లో చాలా పరుగులు ఈ ఇద్దరి బ్యాట్ నుంచే జాలువారాయి ..ఇప్పటివరకు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడీ ఇప్పటి వరకూ 16 శతక భాగస్వామ్యాలు నెలకొల్పగా.. ఈ దశాబ్దకాలంలో వీళ్లిద్దరు అత్యుత్తమం ..అయితే ఈ ఇద్దరి బాగస్వామ్యంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..

ఖర్ ధావన్ చాలా స్వేచ్ఛగా ఆడేస్తాడని మనందరికీ తెలుసు. కానీ.. రోహిత్ శర్మ మాత్రం క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకుంటాడు. ఆ సమయంలో అతనిపై ఒత్తిడి పెరగకుండా ధావన్ బాధ్యత తీసుకుంటాడు. దాంతో.. రోహిత్ శర్మకి తగినంత టైమ్ లభిస్తుంది. క్రీజులోని క్రికెటర్లు.. ఒకరి ఆటని మరొకరు అర్థం చేసుకుంటేనే మెరుగైన భాగస్వామ్యాలు నమోదవుతాయి. మ్యాచ్ ఆరంభంలో ధావన్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తే.. స్పిన్నర్లు రంగప్రవేశం చేసేలోపు రోహిత్ శర్మ సెటిల్‌ అయిపోతాడు. ఈ జోడీ సక్సెస్‌కి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

అయితే ఇటీవలి కాలంలో ధావన్ గాయాలు మరియు ఫామ్ కోల్పోవడంతో ఇండియా జట్టుకు దూరంగా ఉంటున్నాడు ..ధావన్ స్థానంలో టీంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తుండటంతో ధావన్ తన స్థానం ప్రశ్నార్ధకం అయింది ..ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో చోటు కోల్పోయిన ధావన్ , పొట్టి ఫార్మాట్లో కూడా అంతగా రాణించడం లేదు ..అయితే వన్ డే ఫార్మాట్లో మాత్రం ధావన్ స్థానానికి ఇప్పట్లో ఏ ఢోకా లేదు ..

Tags :
|
|
|

Advertisement