Advertisement

  • బ్యాక్ తో బ్యాక్ సెంచరీలతో రికార్డు సృష్టించిన ధావన్...

బ్యాక్ తో బ్యాక్ సెంచరీలతో రికార్డు సృష్టించిన ధావన్...

By: Sankar Wed, 21 Oct 2020 08:36 AM

బ్యాక్ తో బ్యాక్ సెంచరీలతో రికార్డు సృష్టించిన ధావన్...


ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో శతకం బాదిన శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12x4, 3x6).. 5,000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 101 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ టీమ్‌ని గెలిపించిన శిఖర్ ధావన్.. పంజాబ్‌పై శతకంతో 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ ఈరోజు వరకూ లేరు. కానీ.. ఒకే సీజన్‌లో రెండు అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేసిన ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ 2016 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 శతకాలు నమోదు చేయగా.. 2011లో బెంగళూరుకి ఆడిన క్రిస్‌గేల్ రెండు సెంచరీలు బాదాడు.

ఆ తర్వాత 2017లో పంజాబ్‌కి ఆడిన హసీమ్ ఆమ్లా రెండు శతకాలు నమోదు చేయగా.. 2018లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ కూడా రెండు సెంచరీలు బాదేశాడు. తాజా శిఖర్ ధావన్ కూడా ఆ జాబితాలో నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో ధావన్‌కి ఇది రెండో శతకం.

Tags :
|

Advertisement