Advertisement

కేరళలో ముంచుకొస్తున్న షింగెల్లా మహమ్మారి

By: Sankar Mon, 21 Dec 2020 10:51 AM

కేరళలో ముంచుకొస్తున్న  షింగెల్లా మహమ్మారి


ఇప్పటికే దేశం కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూరప్ దేశాల్లో ఇప్పటికే ఈ కొత్త స్ట్రెయిన్ కారణంగా లాక్ డౌన్ విధించారు.

ఇక ఇదిలా ఉంటె, కేరళలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని షింగెల్లా అనే వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది. కోజికోడ్, కొత్తపారంబు ముందికల్ వద్ద ఈ వ్యాధి ఎక్కువగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా 11 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. చిన్నారి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆరుగురికి షింగెల్లా సోకింది. మొత్తం ఇప్పటి వరకు 52 మందికి ఈ షింగెల్లా వ్యాధి సోకింది.

నీటి ద్వారా వేగంగా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నది. వ్యాధి సోకినా వారికి జ్వరం, డయేరియా, కడుపునొప్పి వంటివి వస్తుంటాయి. ఈ వ్యాధి సోకకుండా ఉండాలి అంటే పరిశుభ్రతను పాటించాలి. కలుషితం కానీ ఆహరం తీసుకోవాలి. వ్యాధి సోకిన వారికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం ఆలస్యమైతే ప్రాణాలు పోవచ్చు.

Tags :
|

Advertisement