Advertisement

  • విమర్శకులను తన బ్యాటింగ్ తో సెహ్వాగ్ ఉతికారేసాడు..వీవీఎస్ లక్ష్మణ్

విమర్శకులను తన బ్యాటింగ్ తో సెహ్వాగ్ ఉతికారేసాడు..వీవీఎస్ లక్ష్మణ్

By: Sankar Sat, 06 June 2020 10:49 AM

విమర్శకులను తన బ్యాటింగ్ తో సెహ్వాగ్ ఉతికారేసాడు..వీవీఎస్ లక్ష్మణ్

భారత క్రికెట్ చరిత్రలో అరివీర భయంకర బాట్స్మన్ అంటే ఎవరికీనా గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్ ..తన అసమాన హిట్టింగ్ ప్రతిభతో ఎన్నో మ్యాచ్ లలో టీం ఇండియాకు విజయాలను అందించాడు..టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ తరుపున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచినా సెహ్వాగ్..మొత్తం టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు , వన్ డే క్రికెట్ లో డబల్ సెంచరీ తో సరికొత్త రికార్డు లను నెలకొల్పాడు..అయితే.. పాదాలు కదల్చకుండా ఎక్కువ షాట్లు ఆడే సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ స్టయిల్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ.. ఫుట్‌వర్క్‌ని మార్చుకునేందుకు అతను ఇష్టపడలేదు. విమర్శలు పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లి.. సక్సెస్ అయ్యాడు.

sehwag,laxman,india,test cricket,triple century ,సెహ్వాగ్,  ట్రిపుల్ సెంచరీ, ఫుట్‌వర్క్‌,  టెస్ట్ క్రికెట్ , భారత్

వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ ఆడే అన్నిరోజులూ.. ‘బంతిని చూడటం.. బాదడం’ అనే ఫార్మాలాని సింపుల్‌గా ఫాలో అయిపోయాడు. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. చివరికి మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా సెహ్వాగ్ తన బ్యాటింగ్‌ స్టయిల్‌ని మాత్రం మార్చుకోలేదు. ఆ దూకుడు కారణంగా ఎన్నోసార్లు అతను మ్యాచ్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. కానీ.. లెక్కకి మించి విధ్వంసక ఇన్నింగ్స్‌లు కూడా అతని ఖాతాలో ఉన్నాయి.

వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టయిల్‌ గురించి తాజాగా అతని సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. హైక్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్‌ని ఎదుర్కోలేడనే విమర్శలను అతను ఉతికారేశాడని కితాబిచ్చాడు. అలానే టెస్టు క్రికెట్‌లో విధ్వంసక ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ ఎదిగాడని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు.

Tags :
|
|
|

Advertisement