Advertisement

  • శ‌శిక‌ళ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి రిలీజ్ అయ్యే అవ‌కాశాలు..

శ‌శిక‌ళ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి రిలీజ్ అయ్యే అవ‌కాశాలు..

By: chandrasekar Wed, 16 Sept 2020 5:20 PM

శ‌శిక‌ళ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి రిలీజ్ అయ్యే అవ‌కాశాలు..


దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం బెంగుళూరులోని కేంద్ర కారాగారంలో ఆమె శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. శ‌శిక‌ళ‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తార‌ని ఆర్టీఐ కింద ప్రశ్నించ‌గా జైలు అధికారులు ఈ స‌మాధానం ఇచ్చారు. బ‌హుశా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 27వ తేదీన ఆమె రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు.

శ‌శిక‌ళ కోర్టు విధించిన జ‌రిమానా చెల్లిస్తే, త‌ప్ప‌కుండా ఆ తేదీన ఆమెను రిలీజ్ చేస్తామ‌న్నారు. 2017 ఫిబ్ర‌వ‌రిలో అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ‌ను అరెస్టు చేశారు. అయితే త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె రిలీజ్ కానున్నారు.

అక్ర‌మాస్తుల కేసులో బెంగుళూరు కోర్టు వేసిన నాలుగేళ్ల జైలుశిక్ష‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత అన్నాడీఎంకే ప‌గ్గాల‌ను శ‌శిక‌ళ చేప‌ట్టింది. కానీ ఆ పార్టీ నుంచి ప‌ళ‌నిస్వామి బృందం ఆమెను తొల‌గించారు. అక్ర‌మాస్తుల కేసులో ఇళ‌వ‌ర‌సై, సుధాక‌ర‌న్‌లు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు.

Tags :
|

Advertisement