Advertisement

  • సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన షార్ప్ షూటర్ అరెస్ట్

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన షార్ప్ షూటర్ అరెస్ట్

By: chandrasekar Thu, 20 Aug 2020 09:18 AM

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన షార్ప్ షూటర్ అరెస్ట్


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్యా చేయుటకు ప్రయత్నించిన షార్ప్ షూటర్‌ ను పోలీసులు అరెస్ట్ చేసారు. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన ఓ షార్ట్ షూటర్‌ని హర్యానా‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన ఓ షార్ప్ షూటర్‌ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ షార్ప్ షూటర్‌ని విచారిస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నిన కోణం బయటపడింది. అతడి నెక్ట్స్ హిట్ లిస్టులో వున్నది సల్మాన్ ఖానేనని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.

హత్యా చేయడానికి ప్రయత్నించిన సదరు షార్ప్ షూటర్ ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంట్ వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్టు అంగీకరించాడని పోలీసులు వెల్లడించినట్టు జూమ్ ప్రచురించిన ఓ కథనం పేర్కొంది. జనవరిలోనే ముంబైకి చేరుకున్న షార్ప్ షూటర్ రెండు రోజుల పాటు బాంద్రాలోనే ఉండి సల్మాన్ ఖాన్ కదలికలపై కన్నేసినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు. ఫరిదాబాద్ డీసిపి వెల్లడించిన వివరాల ప్రకారం సల్మాన్ ఖాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన షార్ప్ షూటర్ రాహుల్ తాను రెక్కి పూర్తి చేసిన అనంతరం రెక్కిలో కనుగొన్న విషయాలను బిష్ణోయ్‌కి చేరవేసినట్లు తెలిపాడు.

దేశంలో అనుకోకుండా కరోనావైరస్ వ్యాపించడం మొదలైన అనంతరం లాక్ డౌన్ విధించడంతో ఆ ప్లాన్‌ని అమలు చేయలేకపోయారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరగడం ఇదేం తొలిసారి కాదు. 2018లోనూ ఇదే గ్యాంగ్‌కి చెందిన సంపత్ నెహ్రా అనే షూటర్ సల్మాన్‌ని హత్య చేసేందుకు కుట్రపన్నడమే కాకుండా రెక్కీ కూడా పూర్తి చేశాడు. కానీ అనుకోకుండా సంపత్ నెహ్రా అరెస్ట్ అవడంతో అతడి ప్లాన్ వర్కౌట్ అవలేదు. కరోనా వ్యాప్తి అనంతరం లాక్‌డౌన్ సమయంలో పన్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌లో నాలుగు నెలల పాటు సెల్ఫ్ క్వారంటైన్ అయిన సల్మాన్ ఖాన్ ఇటీవలే మళ్లీ ముంబైకి తిరిగొచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ విషయం తెలిసిన సల్మాన్ అభిమానులు హంతకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో సంతోషించారు.

Tags :

Advertisement