Advertisement

సిక్సర్ల హోరులో షార్జా స్టేడియం

By: chandrasekar Mon, 28 Sept 2020 09:51 AM

సిక్సర్ల హోరులో షార్జా స్టేడియం


ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 34 ఫోర్లు, 29 సిక్సర్లు.. మొత్తంగా 449 పరుగులు నమోదైన మ్యాచ్‌లో రాజస్థాన్‌నే విజయం వరించింది. లీగ్‌లో తొలి శతకం నమోదు చేసిన మయాంక్‌కు ఆ ఆనందం మిగలకుండా చేసారు రాయల్స్‌ బ్యాట్స్ మెన్. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి అయింది. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్‌ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

కన్నడ ఓపెనింగ్‌ జోడీ దంచికొట్టడంతో పంజాబ్‌కు అదిరిపోయే అరంభం లభించింది. రాహుల్‌ బౌండ్రీలతో రెచ్చిపోతుంటే.. మయాంక్‌ సిక్సర్లే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఒకరితో ఒకరు పోటీపడి ఆడటంతో 9 ఓవర్లలోనే పంజాబ్‌ సెంచరీ మార్క్‌ చేరింది. ఒక దశ దాటాక రాహుల్‌ కాస్త నెమ్మదించగా.. మయాంక్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత జోరు పెంచిన అగర్వాల్‌ 45 బంతుల్లో లీగ్‌లో తొలి శతకం నమోదు చేశాడు. తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించాక మయాంక్‌ ఔటయ్యాడు. కాసేపటికే రాహుల్‌ కూడా వెనుదిరిగినా మ్యాక్స్‌వెల్‌ (13 నాటౌట్‌) అండతో పూరన్‌ (8 బంతుల్లో 25; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) పంజాబ్‌కు భారీ స్కోరు అందిచాడు.

లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ కూడా విజృంభించింది. బట్లర్‌ (4) విఫలమైనా.. కెప్టెన్‌ స్మిత్‌తో కలిసి శాంసన్‌ దుమ్మురేపాడు. ఈ జోడీ ధాటికి పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్‌ 69/1తో నిలిచింది. 26 బంతుల్లో అర్ధశతకం చేసిన స్మిత్‌ ఆ మరుసటి బంతికి వెనుదిరిగాడు. సిక్సర్లతో విజృంభించిన శాంసన్‌ జట్టును విజయానికి చేరువ చేయగా.. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ తెవాటియా ఆఖర్లో భారీ షాట్లతో లీగ్‌లో రికార్డు లక్ష్యఛేదనలో భాగమయ్యాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో నికోలస్‌ పూరన్‌ కండ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అశ్విన్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో శాంసన్‌ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్‌పై పూరన్‌ ఆపిన తీరు అందరినీ కట్టిపడేసింది. సిక్స్‌ వెళ్తున్న బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి అందుకున్న పూరన్‌ దాన్ని గ్రౌండ్‌లోకి విసిరాడు.

స్కోరు బోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (సి) గోపాల్‌ (బి) రాజ్పుత్‌ 69, మయాంక్‌ (సి) శాంసన్‌ (బి) కరన్‌ 107, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 13, పూరన్‌ (నాటౌట్‌) 25, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 223/2. వికెట్ల పతనం: 1-183, 2-194, బౌలింగ్‌: ఉనాద్కట్‌ 3-0-30-0, రాజ్‌పుత్‌ 4-0-39-1, ఆర్చర్‌ 4-0-46-0, గోపాల్‌ 4-0-44-0, తెవాటియా 1-0-19-0, టామ్‌ కరన్‌ 4-0-44-1.

రాజస్థాన్‌: బట్లర్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) కాట్రెల్‌ 4, స్మిత్‌ (సి) షమీ (బి) నీషమ్‌ 50, శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 85, తెవాటియా (సి) మయాంక్‌ (బి) షమీ 53, ఊతప్ప (సి) పూరన్‌ (బి) షమీ 9, ఆర్చర్‌ (నాటౌట్‌) 13, పరాగ్‌ (బి) అశ్విన్‌ 0, టామ్‌ కరన్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19.3 ఓవర్లలో 226/6. వికెట్ల పతనం: 1-19, 2-100, 3-161, 4-203, 5-222, 6-222, బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-52-1, షమీ 4-0-53-3, రవి 4-0-34-0, నీషమ్‌ 4-0-40-1, మురుగన్‌ 1.3-0-16-1, మ్యాక్స్‌వెల్‌ 3-0-29-0.

Tags :

Advertisement