Advertisement

  • లారస్ ల్యాబ్స్ షేర్లు రికార్డ్ స్థాయిలను అందుకుంటోంది

లారస్ ల్యాబ్స్ షేర్లు రికార్డ్ స్థాయిలను అందుకుంటోంది

By: chandrasekar Tue, 18 Aug 2020 11:11 AM

లారస్ ల్యాబ్స్ షేర్లు రికార్డ్ స్థాయిలను అందుకుంటోంది


బిజినెస్​ డెస్క్​, వెలుగు: మొదటి సక్సెస్‌ రావడానికి 10 ఏళ్లు పట్టినా, ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఒక్క ప్రొడక్ట్‌‌తో గ్లోబల్‌ కంపెనీగా మారిపోయింది. డిసెంబర్‌, 2016లో అనుభవం లేని ఈ ఫార్మా కంపెనీ హెచ్‌ ఐ వీ డ్రగ్స్‌‌ కోసం రివల్యూషనరీ ఏపీఐని తయారు చేసింది. యాంటి రెట్రోవైరల్‌ (ఏఆర్‌ వీ) అయిన ఎఫవైరంజ్‌ ని డెవలప్‌ చేశాక ఈ కంపెనీ దశ ఒక్కసారిగా తిరిగింది. ఈ కంపెనీనే హైదరాబాద్‌ కు చెందిన లారస్ ల్యాబ్స్‌‌. మొదట్లో కేవలం యాక్టివ్‌ ఫార్మా స్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌‌ (ఏపీఐ) కంపెనీగా స్టార్ట్‌‌ అయి ప్రస్తుతం ఫార్మా ఇండస్ట్రీలో అనేక విభాగాలలో విస్తరించింది.

తాజాగా కంపెనీ క్యూ 1 ఫలితాలు మెప్పించడంతో లారస్‌ ల్యాబ్స్‌‌ షేరు రికార్డ్‌‌ స్థాయిలను అందుకుంటోంది. క్యూ 1 లో కంపెనీకి రూ. 172 కోట్ల నికర లాభం వచ్చింది. ఇది గత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌ లో వచ్చిన లాభం కంటే 1,047 శాతం ఎక్కువ. మార్చి కనిష్టాల నుంచి చూస్తే లారస్‌ ల్యాబ్స్‌‌ షేరు మూడు రెట్లు పెరిగింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌‌ కంటే ఈ కంపెనీ షేరు ఎక్కువగా పెరిగింది. ఇన్‌ స్టి ట్యూషనల్‌ , రిటైల్ ఇన్వెస్టర్ల చూపు ప్రస్తుతం ఈ కంపెనీపై పడింది.

జూన్‌ చివరి నాటికి బీఎన్‌పీ పారిబా అర్బిట్రేజ్‌ ఫండ్‌ 15 లక్షల లారెస్‌ ల్యాబ్‌ షేర్లను కొనుగోలు చేసిందని ఎక్స్చేంజ్‌ ల డేటా చెబుతోంది. దీంతో పాటు గవర్న్‌‌మెంట్‌ పెన్షన్‌ ఫండ్‌ 9,41,732 షేర్లు, ఎంకే( మధుసూదన్‌ కేలా) వెం చర్స్‌‌ 7,58,000 షేర్లను చేశాయి. ఆగస్ట్‌‌ 11 న లారస్‌ ల్యాబ్స్‌‌ షేరు రూ. 1,155.90 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వివిధ సెగ్మెంట్‌ లలోకి ఎంటర్‌ అవ్వడం మంచి ఫలితానిస్తోందని లారస్‌ ల్యాబ్స్‌‌ ఫౌండర్‌ సత్యనారాయణ చావా అన్నారు. కేవలం ఏపీఐలను మాత్రమే డెవలప్‌ చేసే కంపెనీ నుంచి ప్రస్తుతం ఫార్ములేషన్స్‌‌ను లేదా ఫినిష్డ్‌‌ డోసేజ్‌ లను తయారు చేసే కంపెనీగా లారస్‌ ల్యాబ్స్‌‌ మారిం దని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ మొత్తం రెవెన్యూలో ఫార్ములేషన్స్‌‌ నుంచి వచ్చే రెవెన్యూ 36 శాతంగా ఉందని చెప్పారు.

ఏపీఐ టూ ఫార్ములేషన్స్

2006 స్టార్ట్‌‌ అయిన లారస్‌ ల్యాబ్స్‌‌కి 2016 లో భారీ హిట్‌ వచ్చింది. కంపెనీ డెవలప్‌ చేసిన ఏఆర్‌ వీ ఎఫవైరంజ్‌ పెద్ద సక్సెస్‌ సాధించింది. ఈ ఏపీఐపై పేటెంట్‌ తీసుకున్న లారస్‌ ల్యాబ్స్‌‌, దీనిపై లైసెన్స్‌‌ ఇవ్వడం ద్వారా డబ్బులను సంపాదించాలని మొదట్లో అనుకొంది. కానీ ఈ ప్లాన్‌ వర్క్‌‌ అవుట్‌ కాకపోవడంతో తనే సొంతంగా ఈ ఎఫవైరంజ్‌ ఏపీఐని తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ ఏపీఐ పెద్ద సక్సెస్‌ కావడంతో ఇతర ఏఆర్‌ వీలు, ఆంకాలజీ కోసం ఏపీఐలను డెవలప్‌ చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం డయాబెటీస్‌, కార్డియోవాస్కులర్‌ థెరపీ సెగ్మెంట్స్‌‌ కోసం ఏపీఐలను డెవలప్‌ చేసింది. మొదట్లో ఒకే ప్రొడక్ట్‌‌ నుంచి రెవెన్యూను పొందేవాళ్లమని చావా చెప్పారు. తర్వాత తమ ఏపీఐ పోర్ట్‌‌ఫోలియోను విస్తరించడం మొదలు పెట్టామని అన్నారు. ప్రస్తుతం ఫార్ములేషన్స్ బిజినెస్‌ నుంచి కూడా మంచి రెవెన్యూ వస్తోందని అన్నారు. చాలా ఏళ్ల నుంచి మార్పు చెందుతూ వస్తున్నామని, ప్రస్తుతం లారస్‌ కేవలం ఏపీఐ కంపెనీయే కాదని, వేరు వేరు విభాగాలలో ఉన్న ఫార్మా- స్యూటికల్‌ కంపెనీ అని చావా తెలిపారు.

వేగంగా లారస్​ బిజినెస్‌ కెపాసిటీని విస్తరిస్తోంది

డిమాండ్‌ ఉండడంతో లారస్‌ ల్యాబ్స్‌‌ తమ బిజినెస్‌ కెపాసిటీని విస్తరిస్తోంది. గత ఐదేళ్లను గమనిస్తే ఏడాదికి రూ. ౩౦౦ కోట్లు చొప్పున క్యాపిటల్‌ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌ కోసం ఖర్చు చేసింది.

వచ్చే రెండేళ్లలో మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. ఏపీఐ కెపాసిటీని 50 శాతం మేర, ఫార్ములేషన్స్‌‌ కెపాసిటీని ఏడాదికి 900 కోట్ల ట్యాబ్లెట్లకు పెంచాలనుకుంటోంది. దీని కోసం రూ. 600 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. హెచ్‌ ఐవీ ఎక్కువగా విస్తరించిన ఆఫ్రికా, ఆసియాలోని లో, మిడిల్‌ ఇన్‌‌కమ్‌ దేశాలు లారస్‌ ల్యా బ్స్‌‌కు కీలకమైన మార్కెట్‌ లుగా ఉన్నాయి. ఎయిడ్స్‌‌, టీబీ, మలేరియా వంటి వ్యా ధుల కోసం ఏఆర్‌‌‌‌వీ ప్రొడక్ట్‌‌లను సప్లయ్‌ చేయడానికి ఈ కంపెనీకి వివిధ దేశాలు, ఆర్గనైజేషన్ల నుంచి కాం ట్రాక్ట్‌‌లు వచ్చాయి. యూఎస్‌ , యూరప్‌ మార్కెట్‌ లలో కంపెనీ జనరిక్‌ ఫార్ములేషన్స్‌‌ బిజినెస్‌ పెరుగుతోంది. యూఎస్‌ లో 26 అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్ లారస్‌ ల్యా బ్స్‌‌ ఫైల్‌ చేసింది. ఇందులో ఎనిమిది ప్రొడక్ట్‌‌లకు అప్రూవల్స్‌‌ వచ్చాయి.

Tags :
|
|

Advertisement