Advertisement

  • ఉల్లి ఎగుమతుల నిషేధంపై పునరాలోచించాలి: శరద్ పవార్

ఉల్లి ఎగుమతుల నిషేధంపై పునరాలోచించాలి: శరద్ పవార్

By: chandrasekar Wed, 16 Sept 2020 5:12 PM

ఉల్లి ఎగుమతుల నిషేధంపై పునరాలోచించాలి: శరద్ పవార్


ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం గల్ఫ్ దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉల్లి మార్కెట్లలో భారతదేశ ఎగుమతి వాటాను దెబ్బతీస్తుందని ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ తెలిపారు. పాకిస్థాన్ వంటి ఇతర దేశాలు భారతదేశ ఉల్లి ఎగుమతుల స్థానాన్ని పూర్తీ చేసుకుని లాభం పొందుతాయని పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతుల్లో అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు నష్టం కలుగుతుందని అన్నారు. మరోవైపు దేశంలోని ఉల్లి రైతులు దీనిపై ఆందోళన చెందుతున్నారని చెప్పారు.


ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతుల నిషేధంపై పునరాలోచించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. శరద్ పవార్ ఈ మేరకు మంగళవారం ట్వీట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పీయూష్ గోయల్‌కు ట్యాగ్ చేశారు. మరోవైపు ఉల్లి ఎగుమతులపై నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై మహారాష్ట్రలోని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మంగళవారం నిరసన తెలిపారు. ఉల్లి రైతులు రహదారులపై భైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :
|
|

Advertisement