Advertisement

  • మహారాష్ట్ర రాజకీయ నాయకులను కుదిపేస్తున్న బెదిరింపు కాల్స్

మహారాష్ట్ర రాజకీయ నాయకులను కుదిపేస్తున్న బెదిరింపు కాల్స్

By: Sankar Mon, 07 Sept 2020 7:04 PM

మహారాష్ట్ర రాజకీయ నాయకులను కుదిపేస్తున్న బెదిరింపు కాల్స్


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్‌, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సోమవారంనాడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఆదివారం వచ్చిన బెదిరింపు కాల్స్ తరహాలోనే పవార్, దేశ్‌ముఖ్‌ల నివాసాలకు ఈ బెదిరింపు ఫోన్స్ కాల్ప్ వచ్చాయి. ఈ ఇద్దరి నేతలకు దేశం బయట నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.


బాంద్రాలోని ఉద్ధవ్ థాకరే నివాసమైన 'మాతోశ్రీ'కి గుర్తుతెలియని వ్యక్తి ఒకరు శనివారం రాత్రి ఫోన్ చేయడం సంచలనమైంది. దీంతో సీఎం నివాసం వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. అజ్ఞాత నేరప్రపంచ నేత, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం తరఫున దుబాయ్‌ నుంచి మాట్లాడుతున్నట్టు అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో చెప్పాడని, ఉద్ధవ్‌కు ఫోన్ కనెక్షన్ ఇవ్వాలని రెసెప్షనిస్టును అతను కోరగా, రెండుసార్లు ఆ ఫోన్‌ను రెసెప్షనిస్టు డిస్కనెక్ట్ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కాగా, ఉద్ధవ్ నివాసానికి‌ ఫోన్ కాల్స్ వచ్చిన మాటే నిజమేనని, అయితే మాతోశ్రీని పేల్చాస్తామన్న బెదరింపులు రాలేదని మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్ పరబ్ వివరణ ఇచ్చారు.దీంతో ఠాక్రే బంగళా వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు

Tags :

Advertisement