Advertisement

షేన్ వాట్సన్ కీలక నిర్ణయం...

By: chandrasekar Tue, 03 Nov 2020 9:33 PM

షేన్ వాట్సన్ కీలక నిర్ణయం...


2016లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్.. ఇక నుంచి టీ20ల్లోనూ ఆడబోనని చెప్పాడు. వచ్చే సీజన్ నాటికి జట్టును బలోపేతం చేయడంపై చెన్నై దృష్టి సారించిన నేపథ్యంలో వాట్సన్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ ఆడిన వాట్సన్ 299 రన్స్ మాత్రమే చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో చెన్నైకి ఓపెనర్ దొరికిన వేళ వాట్సన్ గౌరవంగా తప్పుకున్నాడు. ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా వాట్సన్ గత రెండు సీజన్లలో చెన్నై తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 2016, 2017 సంవత్సరాల్లో నిషేధం కారణంగా చెన్నై ఐపీఎల్‌లో ఆడలేకపోయింది. 2018లో తిరిగి ఎంట్రీ ఇస్తూనే కప్ కొట్టింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో వాట్సన్ శతకంతో జట్టును గెలిపించాడు. విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ముందు బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 178 రన్స్ చేయగా.. వాట్సన్ 57 బంతుల్లో 117 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన వాట్సన్ సూపర్‌ కింగ్స్‌కు కప్ అందించాడు.

2019 ఐపీఎల్ ఫైనల్లోనూ వాట్సన్ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయబోయాడు. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వాట్సన్, డుప్లెసిస్ శుభారంభం ఇచ్చినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా వాట్సన్ ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ఆరంభంలోనే సింగిల్ తీసే క్రమంలో డైవ్ చేయడంతో గాయపడిన వాట్సన్ మోకాలి వద్ద గాయం బాధిస్తున్నా రక్తంతో ఆ భాగం మొత్తం తడిసిపోతున్నా పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. మలింగ వేసిన చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా ఆ ఓవర్ నాలుగో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో వాట్సన్ రనౌట్ అయ్యాడు. 59 బంతుల్లో 80 రన్స్ చేసిన వాట్సన్ ఔటవడంతో ఒక్క పరుగు తేడా ముంబై కప్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడినా వాట్సన్ పోరాడిన తీరు ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిశాక వాట్సన్ మోకాలికి ఆరు కుట్లు పడ్డాయి. తనకు గాయమైన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వాట్సన్ పోరాడాడని హర్భజన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 2008 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వాట్సన్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ తొలి ఐపీఎల్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2016లో అతణ్ని ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఒకటి కంటే ఎక్కువ ఫ్రాంచైజీల తరఫున టైటిల్ గెలిచిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో వాట్సన్ ఒకడు.

Tags :
|

Advertisement