Advertisement

  • చెన్నై సూపర్ కింగ్స్ కె ఐపీల్ 2020 గెలిచే అవకాశమన్న షేన్ వాట్సన్

చెన్నై సూపర్ కింగ్స్ కె ఐపీల్ 2020 గెలిచే అవకాశమన్న షేన్ వాట్సన్

By: chandrasekar Fri, 11 Sept 2020 5:48 PM

చెన్నై సూపర్ కింగ్స్ కె ఐపీల్ 2020 గెలిచే అవకాశమన్న షేన్ వాట్సన్


ఇండియాలో కరోనా కారణంగా ఐపీల్ మ్యాచ్ లను యూఏఈ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ లో అదే వాట్సన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. జరగబోయే ఐపీఎల్ 2020 టైటిల్‌ నెగ్గేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గొప్ప అవకాశమని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నాడు. అనుభవజ్ఞులైన జట్టును కలిగి ఉండటం అంటే మొదటి మ్యాచ్‌ నుంచే ఒత్తిడిలో తమ నైపుణ్యాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై ఆటగాళ్లకు ఎక్కువ అవగాహన కలిగి ఉండటమని వాట్సన్ నబీల్‌ హషీమ్‌ యూట్యూబ్‌ షోలో చెప్పాడు. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు, అపార అనుభవం మా జట్టులో ఉండటం మాకు కలిసొచ్చే అంశమని, ఈ ఏడాది ట్రోఫీ సాధించే అవకాశం మాకు ఎక్కువగా ఉందని భావిస్తున్నట్లు వాట్సన్‌ తెలిపాడు.

CSK టీంలో వాట్సన్ ఒక మంచి అల్ రౌండర్. అతను ఇన్నింగ్స్ ఓపెన్ చేసి పరుగుల వరద స్టార్ట్ చేస్తే టీం తప్పకుండా గెలవాల్సిందే. పాకిస్థాన్‌ నిర్వహించే సూపర్‌ లీగ్‌లో వాట్సన్‌ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ ఫ్రాంచైజీకి చెందిన నబీల్‌ నిర్వహించిన షోలో అతడు పాల్గొన్నాడు. అతను మాట్లాడుతూ సాధ్యమైనంత ఎక్కువ తప్పులు చేయకుండా ఉండటానికి మాకు ఎక్కువ అవకాశం ఉన్నది. నేను గత నాలుగేండ్లుగా టీ20 మ్యాచ్‌లను ఆడుతూనే ఉన్నాను. నాకు ఎక్కువ అవగాహన ఉన్నప్పటికీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఇప్పటికే సవాలే. 2018 సీజన్‌ నా ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమైనది. ఫైనల్‌ మ్యాచ్ లో వాట్సన్ సెంచరీ చేసి మ్యాచ్ ను విన్నింగ్ దిశకు తీసికెళ్ళాడు. అందువల్ల ఈ మ్యాచ్ తనకు అత్యుత్తమమైన విన్నింగ్ మ్యాచ్ గా అతను చెప్పాడు.

Tags :

Advertisement