Advertisement

  • రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది...షేన్ వార్న్

రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది...షేన్ వార్న్

By: Sankar Thu, 24 Dec 2020 4:49 PM

రెండో టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది...షేన్ వార్న్


టీమిండియా , ఆస్ట్రేలియా మధ్య ఎల్లుండి నుంచి మెల్బోర్న్ లో రెండవ టెస్ట్ ప్రారంభం కానుంది..తొలి టెస్ట్ లో గెలుస్తుంది అనుకున్న ఇండియా బ్యాట్సమెన్ ఘోర వైఫల్యంతో దారుణ పరాజయాన్ని చవి చూసింది....తమ క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ అయింది..

దీనితో టీమిండియా మీద అనేకమంది తీవ్ర విమర్శలు చేసారు..అయితే తాజాగా వార్న్ మాట్లాడుతూ టీంఇండియా తొలి టెస్ట్ చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా బయటపడలేదు అన్నాడు...ఆటగాళ్లు అందరూ ఇంకా అందులోనుండి కోలుకోలేదని వార్న్ పేర్కొన్నాడు. అలాగే ఈ మ్యాచ్ కు కెప్టెన్ కోహ్లీ, పేసర్ షమీ దూరం కావడం టీం ఇండియా కు కలిసిరాని అంశం అని అన్నాడు.

ఆ కారణంగా రెండో టెస్ట్ లో ఆసీస్ విజయం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేసాడు. ఇక మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు అని చెప్పడం కంటే... ఆసీస్ బౌలర్లు అంద్భుతంగా రాణించారు అని చెప్పడం ఉత్తమం అని అన్నాడు.

Tags :

Advertisement