Advertisement

  • షార్జాలో సచిన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఇప్పటికి కూడా ఒక పీడకలే ..షేన్ వార్న్

షార్జాలో సచిన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఇప్పటికి కూడా ఒక పీడకలే ..షేన్ వార్న్

By: Sankar Thu, 01 Oct 2020 5:53 PM

షార్జాలో సచిన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఇప్పటికి కూడా ఒక పీడకలే ..షేన్ వార్న్


షార్జా అనగానే క్రికెట్ ప్రేమికులకు గుర్తొచ్చే పేరు ఇండియన్ క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పటిష్ట ఆస్ట్రేలియా మీద ఆడిన రెండు ఇన్నింగ్స్ ..అప్పటి ఆ సిరీస్ లో సాచి ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడాడు..మల్లి ఇప్పుడు ఐపీయల్ యూఏఈ లో జరుగుతుండటంతో అభిమానులు అప్పటి క్రికెటర్లు మరొకసారి సచిన్ ఆ పెనుతుఫాన్ ఇన్నింగ్సలను గురుచేసుకుంటున్నారు..తాజాగా అప్పటి మ్యాచ్ లో సచిన్ దాటికి బలియైన షేన్ వార్న్ ఆనాటి మ్యాచ్ మీద మరొకసారి స్పందించాడు..

రెండు దశాబ్డాల క్రితం షార్జా ఎడారిలో సచిన్‌తో నాకు ఎదురైన అనుభవం ఇప్పటికీ పీడకలే. మమ్మల్ని చీల్చి చెండాడిన సచిన్‌ మాకు చేదు జ‍్క్షాపకాల్ని మిగిల్చాడు. ప్రత్యేకంగా నన్ను టార్గెట్‌ చేసి రెచ్చిపోయిన తీరు ఇప్పటికీ నాకు గుర్తు. ఆనాటి రెండు సచిన్‌ ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చిరస్మరణీయమే. నాకు ఇక్కడ ఎదురైన చేదు అనుభవాల్ని చెరిపేశాను. ఇక్కడ ప్రతీ జ్ఞాపకాన్ని మది నుంచి తీసేశాను.

ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ కోసం ఇక్కడికి రావడంతో వాటిని మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ సీజన్‌లో షార్జాలో ఆడే మ్యాచ్‌లను రాజస్తాన్‌ గెలుస్తుంది. మా ప్రధాన బౌలింగ్‌ ఆయుధం ఆర్చర్‌. స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీ కూడా మాకు బలం. శాంసన్ టాలెంటెడ్‌ క్రికెటర్‌. నేను స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్‌లను వీక్షిస్తున్నాను. హెడ్‌ కోచ్‌, స్మిత్‌లతో వ్యూహాలని షేర్‌ చేసుకుంటున్నాను. ఇది గొప్పగా అనిపిస్తోంది’ అని వార్న్‌ పేర్కొన్నాడు.

ఇక తమ జట్టులో స్మిత్‌ కెప్టెన్సీ స్టైల్‌ను కొనియాడిన వార్న్‌.. జోఫ్రా ఆర్చర్‌ గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. తమ జట్టుకు ప్రధాన బౌలింగ్‌ ఆయుధం జోఫ్రా ఆర్చర్‌ అని ప్రశంసించాడు. ప్రత్యర్థులకు దడపుట్టిస్తూ పైచేయి సాధించడంలో ఆర్చర్‌ది భిన్నమైన శైలి అని వార్న్‌ ప్రస్తావించాడు.ఇక సంజూ శాంసన్‌ కూడా మ్యాచ్‌ను శాసింగల సామర్థ్యం ఉన్న ఆటగాడని కొనియాడాడు.

Tags :

Advertisement