Advertisement

  • టెస్ట్ సిరీస్ లో హార్దిక్ కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు..షేన్ వార్న్

టెస్ట్ సిరీస్ లో హార్దిక్ కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు..షేన్ వార్న్

By: Sankar Wed, 09 Dec 2020 1:31 PM

టెస్ట్ సిరీస్ లో హార్దిక్ కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు..షేన్ వార్న్


టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మీద ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు...హార్దిక్‌ పాండ్యాను టెస్టు జట్టుకి కూడా ఎంపిక చేయల్సింది. అతను ఉన్న చోట మంచి ఎనర్జీతో పాటు మిగిలిన ఆటగాళ్లకు తన చేష్టలతో మంచి బూస్ట్‌ అందిస్తాడు. ఇలాంటి సూపర్‌ స్టార్‌.. పరిణితి గల ఆటగాడు క్రికెట్‌కు చాలా అవసరం.

పరిమిత ఓవర్లలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చకున్న పాండ్యా టీమిండియాకు బ్యాటింగ్‌లోనూ కీలకంగా మారుతున్నాడు. అందుకు ఆసీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లే నిదర్శనం. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి భారత్‌ తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన పాండ్యా టీ20 సిరీస్‌లోనూ రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఒకవేళ హార్దిక్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసి ఉంటే కచ్చితంగా తనదైన ముద్ర వేసేవాడు.'అని చెప్పుకొచ్చాడు.

కాగా గత ఏడాది గాయం కారణంగా చాల కాలం క్రికెట్ కు దూరం అయిన పాండ్య , ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కు ముందు గాయం ఉంచి కోలుకున్నాడు ..అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో చాల కాలం మల్లి ఇంటికే పరిమితం అయిన ఈ ఆల్ రౌండర్ ఆ తర్వాత జరిగిన ఐపీయల్ లో చెలరేగి ఆడాడు ..తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్ డే , ట్వి ట్వంటీ సిరీస్లలో కూడా బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా కు చుక్కలు చూయించాడు...

Tags :

Advertisement