Advertisement

  • పాక్‌లో గూఢచర్యం కేసులో అరెస్టై 8ఏండ్ల శిక్ష ముగించి భారత్‌కు వచ్చిన షంషుద్దీన్...

పాక్‌లో గూఢచర్యం కేసులో అరెస్టై 8ఏండ్ల శిక్ష ముగించి భారత్‌కు వచ్చిన షంషుద్దీన్...

By: chandrasekar Tue, 10 Nov 2020 4:35 PM

పాక్‌లో గూఢచర్యం కేసులో అరెస్టై 8ఏండ్ల శిక్ష ముగించి భారత్‌కు వచ్చిన షంషుద్దీన్...


70 ఏండ్ల షంషుద్దీన్.. పాకిస్థాన్‌లో గూఢచర్యం కేసులో అరెస్టై ఎనిమిదేండ్ల జైలుశిక్ష అనుభవించి చివరకు కాన్పూర్‌లోని తన స్వస్థలమైన బజారియాకు చేరుకున్నాడు. గూఢచర్యానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అతన్ని 2012లో అరెస్ట్‌ చేశారు. 1992లో షంషుద్దీన్‌ ఉద్యోగం కోసం కాన్పూర్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. పాకిస్థాన్‌కు చెందిన అతని బంధువు ఒకరు అతన్ని తప్పుదోవ పట్టించాడు. చట్టవిరుద్దంగా నకిలీ పత్రాల ద్వారా షంషుద్దీన్‌ను అతడు పొరుగు దేశం పాకిస్థాన్‌కు తీసుకెళ్లాడు. 2012లో తన పాస్‌పోర్టును రెన్యువల్‌ చేయించడానికి ప్రయత్నించినప్పుడు షంషుద్దీన్‌ను పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.

దేశంలోకి అక్రమంగా చొరబడి షంషుద్దీన్‌ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపారు. గూఢచర్యం, నకిలీ పాస్‌పోర్టు కలిగి ఉన్న నేరం కింద అతన్ని దోషీగా తేల్చిన కరాచీ కోర్టు అతనికి ఎనిమిదేళ్ల శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత షంషుద్దీన్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అటారీ-వాఘా సరిహద్దు నుంచి అక్టోబర్‌ 26న ఆయన భారత్‌కు చేరుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి క్వారంటైన్‌లో ఉన్నాడు. అది పూర్తైన తర్వాత అతడు తన కుటుంబానికి కలవబోతున్నాడు.

Tags :

Advertisement