Advertisement

  • ఫిట్నెస్ పెంచుకోవడం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న షమీ

ఫిట్నెస్ పెంచుకోవడం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న షమీ

By: Sankar Fri, 26 June 2020 8:17 PM

ఫిట్నెస్ పెంచుకోవడం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్న షమీ



టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్పీడ్ పెంచుకోవడానికి సరికొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన షమీ.. ఫిట్‌గా ఉండేందుకు మాత్రం రోజూ వర్కవుట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా, శుక్రవారం షమీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బౌలింగులో వేగాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు తన పెంపుడు శునకం సాయంతో ప్రాక్టీస్ మొదలెట్టాడు. పరుగులో తన శునకంతో పోటీకి దిగాడు. దానితో కలిసి పరిగెత్తాడు. పరుగులో తన శునకం కంటే షమీనే ముందుండడం గమనార్హం. ‘స్పీడ్ వర్క్ విత్ జాక్’ అని క్యాప్షన్ తగిలించిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇక ప్రస్తుత ఇండియన్ టీంలో అత్యంత నమ్మదగ్గ బౌలర్లలో షమీ ఒకడు ..వన్ డే క్రికెట్ ,టెస్ట్ క్రికెట్ అనే తేడా లేకుండా అన్ని ఫార్మటు లలో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు ..బుమ్రా , భువనేశ్వర్ , ఇషాంత్ లతో కలిసి టీం ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు..లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన షమీ ఫిట్ నెస్ మీద ద్రుష్టి పెట్టాడు

Tags :
|

Advertisement