Advertisement

అమ్మాయిలూ నాలా తప్పులు చెయ్యవద్దు - షకీలా

By: Anji Sun, 20 Dec 2020 6:04 PM

అమ్మాయిలూ నాలా తప్పులు చెయ్యవద్దు - షకీలా

సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న యువతులు, విద్యను అభ్యసిస్తున్న అమ్మాయిలూ తనలా తప్పులు చేయవద్దని, మోసపోకూడదని నటి షకీలా చెప్పింది. షకీలా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘షకీలా’ అనే పాన్‌ ఇండియన్‌ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. రిచా చద్దా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రజిత్‌ లంకేశ్‌ దర్శకత్వం వహించారు. తాజాగా నిర్వహించిన సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో షకీలా పాల్గొన్నారు.
‘నా వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. నేను బతికుండగానే నా బయోపిక్‌ తెరకెక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ‘షకీలా’ చిత్రాన్ని తెరకెక్కించిన ఇంద్రజిత్‌ లంకేశ్‌కు ధన్యవాదాలు. సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న యువతులు,, చదువుకుంటున్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. నేను చేసిన తప్పులు మీరు చేయకండి. నాలా మోసపోకండి” అని చెప్పింది

Tags :

Advertisement