Advertisement

  • లంక ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగిన షాహిద్ ఆఫ్రిదీ...

లంక ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగిన షాహిద్ ఆఫ్రిదీ...

By: chandrasekar Thu, 03 Dec 2020 2:09 PM

లంక ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగిన షాహిద్ ఆఫ్రిదీ...


గాలే గ్లేడియేటర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ.. వ్యక్తిగత అత్యవసర కారణాలతో ఈ సీజన్లోని తదుపరి కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతున్నాడు. ఇప్పటికే గాలే జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పాకిస్థాన్ బయల్దేరి వెళ్లిన ఆఫ్రిదీ ఎల్‌పీఎల్‌లోని తదుపరి తమ జట్టు ఆడబోయే కొన్ని మ్యాచ్‌లకు తాను దూరం అవుతున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగొస్తానని అన్నాడు.

ఆఫ్రిదీ పాకిస్థాన్ నుంచి శ్రీలంక తిరిగొచ్చినా.. కొద్ది రోజులపాటు క్వాంరటైన్లో ఉండాల్సి రావడంతోపాటు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే ఆఫ్రిదీ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంక వచ్చే ఫ్లయిట్ మిస్సవడంతో నవంబర్ 24న కొలంబో చేరుకున్న ఆఫ్రిదీకి మిగతా ఆటగాళ్లలా వారం రోజులపాటు క్వారంటైన్‌ను తప్పనిసరి చేయలేదు. అతడిలో కరోనా యాంటీ బాడీస్ ఉండటంతో నవంబర్ 27నే మైదానంలో అడుగుపెట్టాడు. జాఫ్నా స్టాలియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిదీ 23 బంతుల్లోనే 58 రన్స్ చేశాడు. కానీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మిగతా రెండు మ్యాచ్‌ల్లో 12, 0 చొప్పున పరుగులు చేశాడు. కూతురి అనారోగ్యం కారణంగానే ఆఫ్రిదీ స్వదేశం బయల్దేరి వెళ్లాడని కొందరు ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

Tags :
|

Advertisement