Advertisement

కోలుకుంటున్న మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ

By: chandrasekar Fri, 19 June 2020 12:28 PM

కోలుకుంటున్న మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ


కరోనా వైరస్ బారినపడిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి సీరియస్‌గా ఉందని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. గత శనివారం తనకి కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అఫ్రిది తొందరగా కోలుకునేందుకు అందరూ ప్రార్థనలు చేయాలని సూచించాడు. దాంతో కొంత మంది అతని ట్వీట్‌పై సెటైర్లు పేల్చగా భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌తో పాటు మరికొంతమంది క్రికెటర్లు అతను తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్‌లో మార్చి నుంచే లాక్‌డౌన్ ఆంక్షలు విధించగా షాహిద్ అఫ్రిది మాత్రం పలుచోట్ల తిరిగాడు. ‘అఫ్రిది ఫౌండేషన్’ ద్వారా నిరుపేదలకి నిత్యావసరాలని పంపిణీ చేసిన అఫ్రిది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సైతం పర్యటించాడు. దాంతో అతనికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అఫ్రిది కూడా ఇదే విషయాన్ని తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లో అంగీకరించాడు.

కరోనా వైరస్ సోకిందని ట్విట్టర్‌లో ప్రకటించిన అఫ్రిది ఆ తర్వాత తన ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారాన్ని అభిమానులతో పంచుకోలేదు. సోషల్ మీడియాలో మాత్రం అఫ్రిదికీ సీరియస్‌గా ఉందంటూ ప్రచారం జరిగింది. దాంతో స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన అఫ్రిది తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు.

‘‘నా ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వినిపిస్తుండటంతో ఈ వీడియో చేయాల్సి వస్తోంది. ఫస్ట్ 2- 3 రోజులు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగవుతోంది. అయితే చికిత్స కారణంగా నా పిల్లలని చాలా మిస్ అవుతున్నా. జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఛారిటీ వర్క్‌లో భాగంగా చాలా చోట్ల తిరిగాను. అప్పుడే నేను కరోనా వైరస్ బారినపడతానని ఊహించా అయితే కాస్త ఆలస్యమైందంతే" అని అఫ్రిది వెల్లడించాడు.

Tags :
|

Advertisement