Advertisement

  • బాబర్ అజామ్ తొలుత టి ట్వంటీ లలో రాణించలేడు అని అనుకున్నాను ..షాహిద్ ఆఫ్రిది

బాబర్ అజామ్ తొలుత టి ట్వంటీ లలో రాణించలేడు అని అనుకున్నాను ..షాహిద్ ఆఫ్రిది

By: Sankar Wed, 08 July 2020 12:56 PM

బాబర్ అజామ్ తొలుత టి ట్వంటీ లలో రాణించలేడు అని అనుకున్నాను ..షాహిద్ ఆఫ్రిది



ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ లో టి ట్వంటీ ఫార్మటు లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడు పాకిస్తాన్ యువ ప్లేయర్ బాబర్ అజామ్ ..వన్ డే , టెస్ట్ , టి ట్వంటీ ఇలా మూడు ఫార్మటు లలో అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు ..కొందరు మాజీలు అయితే విరాట్ కోహ్లీ తో బాబర్ అజామ్ ను పోల్చుతున్నారు ..ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన బాబర్.. 50.72 సగటుతో 1,471 పరుగులు చేయగా.. ఇందులో ఏకంగా 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ..అయితే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో ఉన్న అజామ్ రాబోయే రోజుల్లో టి ట్వంటీ లలో అంతగా రాణించలేడు అని తాను తొలుత భావించినట్లు చెప్పాడు పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ..

వన్డే, టెస్టులు ఓకే.. కానీ.. టీ20ల్లో మాత్రం బాబర్ అజామ్ సుదీర్ఘకాలం ఆడలేడని పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ‘‘నా అంచనా ప్రకారం టీ20ల్లో బాబర్ అజామ్ ఎక్కువ రోజులు రాణించలేడు. వన్డే, టెస్టుల్లో మాత్రం ఆధిపత్యాన్ని ప్రదర్శించగలడు అని నేను తొలుత భావించాను . అయితే రోజు రోజుకి బాబర్ అజామ్ ఒక క్రికెటర్‌గా చాలా మెరుగవుతున్నాడు.

అది కేవలం అతని హార్డ్‌వర్క్ ద్వారానే సాధ్యమవుతోంది. అంతేతప్ప.. నేను ఏబీ డివిలియర్స్ లేదా విరాట్ కోహ్లీ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. లక్ష్యాల్ని పెట్టుకుని.. దానికి తగినట్లు కష్టపడాలి’’ అని యువ క్రికెటర్లకి అఫ్రిది సూచించాడు. ఇటీవల పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల్ని బాబర్ చేపట్టిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement