Advertisement

  • బౌలర్ ను తిట్టినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ స్టార్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది

బౌలర్ ను తిట్టినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ స్టార్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది

By: Sankar Tue, 01 Dec 2020 9:15 PM

బౌలర్ ను తిట్టినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన పాక్ స్టార్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది


కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న లంక ప్రీమియర్ లీగ్ ఇటీవలే మొదలయిన విషయం తెలిసిందే ...అయితే ఈ లంక ప్రీమియర్‌ లీగ్‌ 2020లో గాలే గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ఆఫ్ఘన్‌ బౌలర్‌ నవీన్‌ హుల్‌ హక్‌ను బహిరంగంగా దూషించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంపై ఆఫ్రిది మంగళవారం ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ' నేను నవీన్‌ హుల్‌ హక్‌ను తిట్టలేదు. షేక్‌ హ్యాండ్‌ సందర్భంగా నవీన్‌ దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్‌ అయిన మాట వాస్తవమే. మ్యాచ్‌లో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకోకూడదని సూచనలు మాత్రమే ఇచ్చాను.

అంతేగాని అతనిపై ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు. నాకు ఆఫ్ఘన్‌ ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. మనం ఒక జట్టులో ఉన్నామంటే సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడమనేది ఆటలో కనీస ధర్మం. అంటూ వివరణ ఇచ్చాడు

Tags :

Advertisement