Advertisement

వంటకాలన్నీ సిద్ధం చేసిన షారుఖ్‌ఖాన్

By: chandrasekar Mon, 28 Sept 2020 5:50 PM

వంటకాలన్నీ సిద్ధం చేసిన షారుఖ్‌ఖాన్


కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని హోటళ్లు మూత పడ్డాయి. లాక్‌డౌన్‌ విరామంలో షారుఖ్‌ఖాన్‌ తన పిల్లల కోసం గరిటె పట్టారు. వారికి ఇష్టమైన వంటకాలన్నీ చేసిపెట్టారు. ఈ విషయాన్ని షారుఖ్‌ఖాన్‌ భార్య గౌరీఖాన్‌ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షారుఖ్‌ఖాన్‌కు వంట చేయడమంటే చాలా ఇష్టం.

షారుఖ్‌ఖాన్‌కు పాకశాస్త్రంలో చక్కటి ప్రావీణ్యముంది. ఇంతకుముందు షూటింగ్‌, నిర్మాణపరమైన పనులతో బిజీగా ఉండటంతో షారుఖ్‌కు కిచెన్‌లో అడుగుపెట్టే అవకాశం ఎప్పుడూ రాలేదు. మార్చిలో లాక్‌డౌన్‌ మొదలవ్వడంతో నటన, నిర్మాణ సంస్థ వ్యవహారాలన్నీ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు.

ప్రభుత్వ కట్టుబాట్లు మరియు వైరస్‌ భయంతో బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేయడానికి భయమేసేది. దాంతో పిల్లలకు ఇష్టమైన వంటకాలన్నీ షారుఖ్‌ఖాన్‌ స్వయంగా సిద్ధంచేశారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో కిచెన్‌ డ్యూటీ మొత్తం ఆయనే చూసుకున్నారు. నాలుగు నెలలు నేను కిచెన్‌ వైపు వెళ్లలేదని భార్య గౌరీఖాన్‌ తెలిపింది. ఆయనే రుచిగా వంటలు వండి పిల్లలకు అందించారని తెలిపారు.

Tags :
|

Advertisement