Advertisement

  • నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం ...

నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం ...

By: Sankar Mon, 16 Nov 2020 07:36 AM

నేటి నుంచి తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం ...


వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకుంది. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య శబరిమల ఆలయంలోకి సోమవారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. కఠిన ఆంక్షల మధ్య రోజుకు 1000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో 2వేల మందిని అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 26 వరకు ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు.

భక్తులందరికీ కరోనా టెస్టు నిర్వహించనుండగా 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దగ్గు, జలుబు ఉన్నవారు, ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నవారు కూడా దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి సూచించింది.శబరిమలకు వచ్చే భక్తులంతా 24 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలి.

వైద్య ఫలితాల్లో నెగటివ్​ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి.రాకపోకల సమయాల్లోనూ భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే. ప్రతి 30 నిమిషాలకు శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.మాస్కులు తప్పనిసరిగా దరించాలి.

Tags :
|

Advertisement