Advertisement

హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

By: Dimple Tue, 11 Aug 2020 01:38 AM

హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ పోలీసులు మరో హైటెక్ సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సుల్తాన్ బజార్‌లో భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ లాడ్జినే దాని యాజమాన్యం వ్యభిచార కూపంగా మార్చేసింది.
లాడ్జిలోకి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార దందా నడుపుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పారిధిలోని ఓ లాడ్జిలో యాజమాన్యమే గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా లాడ్జిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచార దందా సాగిస్తున్న లాడ్జి యాజమానితో పాటు సెక్స్ వర్కర్లు, విటులను రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.
వారందరినీ సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యభిచార దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement