Advertisement

  • గుట్టు రట్టు.. హైటెక్‌ వ్యభిచార...సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు...!

గుట్టు రట్టు.. హైటెక్‌ వ్యభిచార...సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు...!

By: Anji Mon, 07 Dec 2020 7:46 PM

గుట్టు రట్టు.. హైటెక్‌ వ్యభిచార...సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు...!

చిత్తూరు జిల్లాలో గుట్టుగా హైటెక్‌ వ్యభిచార దందా నడుపుతున్నారు. కొంత మంది బలహీనతలను ఆసరాగా చేసుకుని.. పేద మహిళలు, విద్యార్థులకు డబ్బు వల విసిరి అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం నిర్వాహకులు సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.

కొంత మంది సులభంగా డబ్బు సంపాధించేందుకు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్లను ఎంచుకుంటున్నారు.

చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, తమిళనాడు నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. తిరుపతి కాల్‌గర్ల్స్‌తోనే డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్స్‌ క్రియేట్‌ కావడం గమనార్హం.

వాటిని చూసి ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, ఫీజు, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ పంపిస్తారు. యువతి నచ్చి, డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జిలకు రమ్మని విటులకు చెబుతున్నారు.

అలా కాదనుకుంటే ఆ యువతులను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జిలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా యథేచ్ఛగా..

వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు.

అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్‌ నంబర్‌ సైతం పెడుతున్నారు. గంటకు రూ.1,000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పేదరికంలో ఉన్న యువతులే టార్గెట్‌

పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్లు తెలిసింది.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు, లాడ్జిలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసుకుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.

ఇటీవలే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు. తాజాగా, శుక్రవారం తిరుపతి నగరంలో పలమనేరుకు చెందిన వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.

పోలీసుల విచారణలో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడయ్యాయి. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉండడం గమనార్హం. ఈ దందాలో మహిళ కీలకంగా వ్యహరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఫోన్‌ వివరాల ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

Tags :
|

Advertisement