Advertisement

  • ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో దుష్ప్రభావాలు !

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో దుష్ప్రభావాలు !

By: Sankar Fri, 13 Nov 2020 1:12 PM

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో దుష్ప్రభావాలు !


ఫార్మా కంపెనీ ఫైజర్‌ తయారు చేస్తున్న కోవిడ్‌ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి.

జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్‌ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్‌ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే.

టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్‌టెక్‌లు తెలిపాయి.

Tags :
|

Advertisement