Advertisement

  • శ్రావణి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి

శ్రావణి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి

By: chandrasekar Thu, 10 Sept 2020 09:29 AM

శ్రావణి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి


శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైన దేవరాజ్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు వెల్లడించాడు. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. శ్రావణి కుటుంబసభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు దాడి చేశారనే అవమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని ఆరోపించాడు. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి వేధింపులు కారణంగానే శ్రావణి చనిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దేవరాజ్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ మొత్తం పోలీసుల ముందు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని ఆరోపించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని శ్రావణిని సాయి బెదిరించాడని తెలిపాడు.

శ్రావణి చివరిగా ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పిందని దేవరాజ్ రెడ్డి తెలిపారు. తనను హింసిస్తున్నారని ఫోన్‌లో శ్రావణి చెప్పిందని.. మూడు రోజుల షూటింగ్ తరువాత తన దగ్గరకు వస్తానని చెప్పిందని వివరించాడు. శ్రావణిని డబ్బుల కోసం నేనేమీ బ్లాక్ మెయిల్ చేయలేదని దేవరాజ్ రెడ్డి అన్నారు. గతంలో ఇంట్లో వాళ్ల ఒత్తిడితోనే నాపై కేసు పెట్టిందని అన్నాడు. శ్రావణి తనను ప్రేమించిన విషయం వాస్తవమని ఈ కారణంగానే ఈ కేసులో తన మీద ఆరోపణలు వస్తున్నాయని అన్నాడు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్‌లో నివసిస్తున్న శ్రావణి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా శ్రావణి చనిపోయి ఉంది. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించారు.

వైద్యులు శ్రావణిని పరిశీలించిన తరువాత అప్పటికే ఆమె చనిపోయిందని తేల్చారు. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజు రెడ్డి వేధింపులే కారణం అని కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ శ్రావణి మృతికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.శ్రావణికి టిక్ టాక్ ద్వారా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజ్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. శ్రావణి గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. అందులో ముఖ్యంగా మౌనరాగం, మనసు మమత లాంటీ పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఆమె మరణంతో అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

Tags :
|

Advertisement