Advertisement

  • దేశంలో తగ్గని కరోనా ఉదృతి ..ఏడు లక్షలు దాటిన కేసులు ...

దేశంలో తగ్గని కరోనా ఉదృతి ..ఏడు లక్షలు దాటిన కేసులు ...

By: Sankar Wed, 08 July 2020 07:06 AM

దేశంలో తగ్గని కరోనా ఉదృతి ..ఏడు లక్షలు దాటిన కేసులు ...



ఇండియాలో కరోనా రోజు రోజుకి సరికొత్త రికార్డు లను నమోదు చేస్తుంది ..లక్ష నుంచి ఇంకో లక్ష కేసులకు చేరుకోవడానికి మధ్య సమయం అంతకంతకు తగ్గుతూ వస్తుంది ..తాజాగా ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కేసులను చేరుకోవడానికి కేవలం అయిదు రోజులే పట్టింది ..అంటే రోజుకి ఇరవై వేల కేసులు నమోదు అవుతున్నాయి ..ఒక్కరోజులోనే 22,252 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరింది.

గత 24 గంటల వ్యవధిలో మరో 467 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 20,160కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయిదు రోజులుగా వరుసగా రోజుకు 20 వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. 1 నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా అక్కడి నుంచి 7 లక్షలకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. ఇప్పటి వరకూ 61.13 శాతం మంది రోగులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం వరకు మొత్తం 1,02,11,092 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపారు.

ప్రపంచంతో పోలిస్తే భారత్‌లోనే కరోనా కేసులు, కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రపంచంలో ప్రతి పది లక్షల మందిలో 1,453.25 మందికి కరోనా సోకుతుండగా, అది భారత్‌లో 505.37గా ఉంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి 68.29 మంది కరోనాతో చనిపోతుండగా, భారత్‌లో అది 14.27గా ఉంది. ఈ సంఖ్య యూకేలో 651.4, మెక్సికోలో 235.5గా ఉంది.ఇక కరోనా అత్యధిక కేసుల విషయంలో మహారాష్ట్ర ముందుండగా తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ ఉన్నాయి.

Tags :
|
|
|
|

Advertisement