Advertisement

  • వాలంటీర్ చెప్పినవి అన్ని అబద్దాలు ...కరోనా వ్యాక్సిన్ పై చేసిన ఫిర్యాదును కొట్టిపారేసిన సీరం

వాలంటీర్ చెప్పినవి అన్ని అబద్దాలు ...కరోనా వ్యాక్సిన్ పై చేసిన ఫిర్యాదును కొట్టిపారేసిన సీరం

By: Sankar Tue, 01 Dec 2020 9:08 PM

వాలంటీర్ చెప్పినవి అన్ని అబద్దాలు ...కరోనా వ్యాక్సిన్ పై చేసిన ఫిర్యాదును కొట్టిపారేసిన సీరం


కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే...అయితే ఈ ఫిర్యాదు పై సీరం స్పందించింది..

వలంటీర్‌ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్‌ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్‌ అబద్దం చెప్తున్నాడు.. అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ని బ్లేమ్‌ చేస్తున్నాడు.

ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. అబద్ధాలతో సంస్థ ప్రఖ్యాతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాడు’ అని ప్రకటనలో పేర్కొంది. అంతేకాక సదరు వలంటీర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ సానుభూతి వ్యక్తం చేసింది. వలంటీర్‌ ఆరోపణలపై ఆదివారమే స్పందించిన సీరం.. నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది.

Tags :

Advertisement