Advertisement

  • నాతో ఆడుకోకు దేవా ..సీరియల్ నటి శ్రావణి ని బెదిరించిన దేవరాజ్ ఆడియో లీక్

నాతో ఆడుకోకు దేవా ..సీరియల్ నటి శ్రావణి ని బెదిరించిన దేవరాజ్ ఆడియో లీక్

By: Sankar Thu, 10 Sept 2020 06:22 AM

నాతో ఆడుకోకు దేవా ..సీరియల్ నటి శ్రావణి ని బెదిరించిన దేవరాజ్ ఆడియో లీక్


నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రావణి స్నేహితుడు దేవరాజ్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవమని సాయి అనేవ్యక్తి మరో వీడియోను విడుదల చేసాడు. శ్రావణికి తాను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ని అని చెప్పాడు. శ్రావణి చనిపోయినప్పటి నుండి తాను ఆమె మృతదేహం వద్దనే ఉన్నానని...ఎక్కడికి పారిపోలేదని అన్నారు. శ్రావణి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు.

ఇక ప్రస్తుతం శ్రావణి-దేవరాజ్ ల ఫోన్ సంభాషణ భయటకు వచ్చింది. ఆ సంభాషణలో దేవరాజ్ శ్రావణిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. "మర్యాదగా వచ్చి ఒక గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవని దేవరాజ్ ఫోన్ లో బెదిరించాడు. కాగా అతడికి సమాధానమిస్తూ శ్రావణి మాట్లాడుతూ....‘ఇంతటితో ఆపేయ్.. నీకు విశ్వాసం లేదు దేవ..నాతో ఆడుకోకు.. నీతో మాట్లాడను సారీ దేవ" అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సంభాషణ ఆత్మహత్య కేసులో కీలకంగా మారింది.

కాగా తెలుగు టీవీలో యువ నటులలో ఒకరిగా శ్రావణి మంచి గుర్తింపు తెచ్చుకుంది...మనసు మమతా , మౌనరాగం వంటి సీరియల్ లలో తన నటనతో అలరించింది..ఇంకా చాల కెరీర్ ఉన్న ఈ యువ నటి ఇలా అకస్మాత్తుగా చనిపోవడం అందరి హృదయాలను కలచివేస్తుంది

Tags :
|

Advertisement