Advertisement

  • యుఎస్ ఓపెన్ ఆడేందుకు నేను సిద్ధం ..సెరెనా విలియమ్స్

యుఎస్ ఓపెన్ ఆడేందుకు నేను సిద్ధం ..సెరెనా విలియమ్స్

By: Sankar Thu, 18 June 2020 12:51 PM

యుఎస్ ఓపెన్ ఆడేందుకు నేను సిద్ధం ..సెరెనా విలియమ్స్



కరోనా మహమ్మారి కారణముగా ప్రపంచంలో ఉన్న అన్ని క్రీడలు ఆగిపోయాయి ..దాదాపు మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు క్రీడల నిర్వహణపై ఎటువంటి స్పందన లేదు ..టెన్నిస్లో ప్రతిష్టాత్మక టోర్నీలు అయిన గ్రాండ్స్లామ్లో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ , వింబుల్డన్ రద్దు అయ్యాయి ..ఇక మిగిలింది యుయస్ ఓపెన్ మాత్రమే , అది కూడా నిర్వహించడం కష్టమే అని భావిస్తున్న తరుణంలో నిర్వాహకులు ప్రేక్షకులు లేకుండా ఖాళి స్టేడియంలలో మ్యాచ్లను నిర్వహిస్తామని ప్రకటించారు ..

అయితే యూఎస్‌ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్‌, నడాల్‌లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు తాను సిద్ధమని తెలిపింది. ఈ మేరకు యూఎస్‌ టెన్నిస్‌ సంఘం టోర్నీ ప్రజెంటేషన్‌ కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని సెరెనా ప్రకటించింది.

ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనా.. టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోలో పేర్కొంది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నట్టు టోర్నీ నిర్వాహకులు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే

Tags :
|
|
|

Advertisement