Advertisement

  • Breaking News: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కొత్త ట్విస్టు...!

Breaking News: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కొత్త ట్విస్టు...!

By: Anji Tue, 10 Nov 2020 6:26 PM

Breaking News: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంలో కొత్త ట్విస్టు...!

దుబ్బాకలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారని అందరూ అనుకుంటున్న తరుణంలో ఎన్నికల ప్రధాన అధికారు శశాంక్ గోయల్ పెద్ద బాంబు పేల్చారు.

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఆయన మంగళవారం సాయంత్రం వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధృవీకరించలేదు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడిన శశాంక్ గోయల్ ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఫలితాన్నింకా అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు.

‘‘దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు… ఇంకా నాలుగు ఈవీఎం లలో ఓట్లను లెక్కించాలి.. వివి ప్యాట్‌లతో వాటిని లెక్కిస్తాము.. నాలుగు ఈవీఎంలలో కలిపి మొత్తం 1,669 ఓట్లు ఉన్నాయి…

మరికొద్ది సేపట్లో వీటిని లెక్కించి పూర్తి రిజల్ట్ ప్రకటిస్తాము..’’ అని శశాంక్ గోయల్ వ్యాఖ్యానించారు. ‘‘ 21, 188 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి.. అక్కడ వీవీపాట్లను లెక్కిస్తాం.. 136, 157 పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ డిలీట్ చేయలేదు.. అక్కడ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.. ఆ తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడిస్తాం..’’ శశాంక్ గోయల్ వివరించారు.

అయితే, ఈ నాలుగు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు 1,669 కాగా ప్రస్తుం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం 1,118 ఓట్లు. ఇప్పటి వరకు రౌడ్ల వారీగా వెల్లడైన ఓట్లను పరిశీలిస్తే ఈ నాలుగు ఈవీఎంలలో ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశం లేదని, అప్పుడు రఘునందన్ రావు ఆధిక్యం స్వల్పంగా పెరగడం కానీ, తగ్గడం కానీ అవుతంది కానీ మొత్తం ఫలితం తారుమారు కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags :
|

Advertisement