Advertisement

  • ఆ ఇద్దరు సీనియర్ నాయకులూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలి ..కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఆ ఇద్దరు సీనియర్ నాయకులూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలి ..కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

By: Sankar Wed, 02 Sept 2020 08:08 AM

ఆ ఇద్దరు సీనియర్ నాయకులూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరాలి ..కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు


కాంగ్రెస్ సీనియర్ నేత‌లు క‌పిల్ సిబ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి బీజేపీలో చేరాల‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సూచించారు. ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశార‌ని, పార్టీని నిర్మించార‌ని అన్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత కూడా వారికి పార్టీలో గౌర‌వం ద‌క్క‌డ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

పార్టీ అధ్యుక్షుని మార్పున‌కు సంబంధించి సిబ‌ల్‌, ఆజాద్ వంటి నేత‌లు బీజేపీకి అమ్ముడుపోయార‌ని రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఈనేప‌థ్యంలో కాంగ్రెస్ రాజీనామా చేసి అధికార పార్టీలో చేర‌డ‌మే మంచిద‌ని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పారు.

జ్యోతిరాదిత్య సింథియాలా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాల‌ని వారికి సూచించారు. సచిన్ పైలట్‌ కూడా పార్టీని వీడినప్పటికీ మళ్లీ రాజీ కుదిరిందన్నారు. కాంగ్రెస్‌ను నిర్మించిన‌వారిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం రాహుల్ గాంధీకి త‌గ‌ద‌ని చెప్పారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కులమతాలకతీతంగా ప్రజలు బీజేపీలో చేరుతున్నార‌ని తెలిపారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్ని‌క‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 350కి పైగా సీట్లు గెలుపొందుతుంద‌ని వెల్ల‌డించారు.

Tags :
|
|
|
|

Advertisement